వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన రాజులపూడి భాస్కరరావు,


 వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన రాజులపూడి భాస్కరరావు, ఈరోజు భట్నవిల్లిలోని మాజీ మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారి నివాసంలో అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ గారు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం,రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు గారు,జెడ్పీటీసీ పందిరి శ్రీహరి గారు,గ్రామ కమిటీ అధ్యక్షులు రాజులపూడి మురళీ గారు,పట్టణ అధ్యక్షులు సంసాని నాని గారు,జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు ములపర్తి శ్రీను గారు,రాజులపూడి నాగేశ్వరరావు గారు,పమ్మి తాతాజీ గారు,కుమ్మరి శ్రీను గారు,సంసాని అబ్బు గారు,మెండు దుర్గాప్రసాద్ గారు,మరియు నాయకులు,తదితరులు పాల్గొన్నారు