పాస్టర్స్ ఫ్యామిలీ ఐక్య క్రిస్మస్..
మన్నా జూబ్లీ చర్చ్ అమలాపురం
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మండలం: క్రీస్తు జననం సందర్భంగా డిసెంబర్ మాసం హడావిడి ప్రారంభం, కుల మతాలకతీతంగా యేసుక్రీస్తు జననం చిహ్నమైన నక్షత్రాలు దేవాలయాలలో, వీధులలో వివిధ సైజులలో ఏర్పాటు చేస్తుండగా, క్యారల్స్ నిర్వహిస్తుండగా క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి.
సోమవారం సాయంత్రం 5గం" అమలాపురం,నల్లవంతెన మన్నా జూబ్లీ చర్చ్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్య క్రిస్మస్ ప్రెసిడెంట్ పాస్టర్ కారల్ డేవిడ్ కొమానపల్లి, సెక్రటరీ యెహోషువ ముంగి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్రారంభంలో క్రీస్తు జననం గీతాలు ఆలపించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పలగుప్తం ప్రార్థన శక్తి వ్యవస్థాపకులు పాస్టర్ చిక్కం ఇస్సాకు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. దైవజనులు కష్ట కాలంలో ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోరు. ఈ ఫెలోషిప్ కష్టకాలంలో ఆదుకునే ఫెలోషిప్ గా దేవుడు చేస్తున్నాడు. అని తెలియజేశారు.
అమలాపురం, ముమ్మిడివరం, పి గన్నవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం జోన్ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు శుభములు తెలియజేశారు. క్యాండిల్ సర్వీస్, క్రిస్మస్ కేక్ కటింగ్, క్రిస్మస్ కానుకగా వచ్చిన దైవజనులకు, దైవజనురాండ్రకు పరిశుద్ధ గ్రంథములు (బైబిల్) బహుకరించారు. మరియు జిల్లా క్యాబినెట్ వారు ఇటీవల ప్రభువు నందు నిద్రించిన(చనిపోయిన) దైవజనులు మద్ద బాబూజీ, దావీదు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్స్ రెవ.విక్టర్ నందా, రెవ. ఎర్నెస్ట్ తాతపూడి, రెవ. యు భాస్కర రావు, జాయింట్ సెక్రెటరీ రెవ.అబ్రహం పిన్ని, ట్రెజరర్ రెవ.ఇమ్మానుయేలు ముఖ్య అతిధి రెవ.ఇస్సాకు ను ఘనముగా సన్మానించారు. జిల్లా నలుమూలల నుండి వందలాదిమంది పాస్టర్స్ కుటుంబాలతో పాల్గొని దేవుని ఆరాధించారు.

Social Plugin