మహిళా విద్యకు ఆద్యురాలు సావిత్రిబాయి పూలే

కూటమి ప్రభుత్వంలో పలు విద్యాసంస్కరణలు

నూతన గురుకుల పాఠశాల భవనానికి కృషి

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్


మహిళా విద్యకు సావిత్రిబాయి పూలే ఆద్యు రాలని, ఆమె  జీవితం ప్రతి మహిళకు  ఆదర్శమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శనివారం రామచంద్రపురం లోని మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొని మాట్లాడారు.  విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని మంత్రి సూచించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  విద్యావ్యవస్థలో పెను మార్పులు, సంస్కరణలు తీసుకు  వచ్చారని ప్రశంసించారు. గత హాస్టల్ బిల్డింగ్ లో ఉన్న విద్యార్థినులు అవస్థలు చూసి రామచంద్రపురం లోని  ఒక ప్రైవేట్ బిల్డింగు  విద్యార్థులను తరలించి సహాయం చేసిన మంత్రి కు విద్యార్థులు, సిబ్బంది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అవసరమని , వారిలో దాగివున్న కళలను  గుర్తించి  ప్రోత్సహించాలన్నారు.హాస్టల్ లో  విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు కళ్యాణి,మధులత,అనిత లు ఆటస్థలం, మరుగుదొడ్లు, హాస్టల్ నూతన భవనం, మున్సిపల్ త్రాగునీరు అందించాలని కోరారు. స్పందించిన మంత్రి ప్రభుత్వం దృష్టికి  సమస్యలు తీసుకెళ్లి  పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్  గాదంశెట్టి శ్రీదేవి, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవెల్లి శివ, ఎంఈఓ లు వీర రాఘవరెడ్డి, వాసంశెట్టి నాగేశ్వరి, గొల్లపల్లి కృష్ణ, ప్రిన్సిపల్ జె శైలజ, వైస్ ప్రిన్సిపల్ రేణుక దేవి, కొమరిన వీర్రాజు, కొండపల్లి విశ్వతేజ, గణేష్ శర్మ, శ్రీను, దుర్గాప్రసాద్, విద్యా కమిటీ  సభ్యులు ప్రసాద్, బొంతు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురుకుల పాఠశాల అభివృద్ధికి హామీ ఇచ్చిన  మంత్రి సుభాష్ ను సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు ఘనంగా సత్కరించారు.