మంత్రి సుభాష్ చే రూ.70 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజవర్గం కె గంగవరం మండలం భట్లపాలిక గ్రామంలో రూ.70 లక్షలతో నిర్మించనున్న బిటి, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం భూమి పూజ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ.49.20 లక్షలతో నిర్మించనున్న బిటీ రోడ్డు, పీఎం ఏ జె వై పథకం కింద రూ.20 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లు కు కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, పంచాయతీరాజ్ డిఈ కె శ్రీనివాసరావు, ఎఈ యేసు రత్నం, కూటమి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రజల మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రామచంద్రపురం నియోజవర్గంలో రూ.160 కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, పిఎసిఎస్ అధ్యక్షులు గెడ్డం పల్లపురావు, రవ్వా నాగభూషణం, గ్రామ సర్పంచ్, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Social Plugin