దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలి – కోనసీమ క్రైస్తవ జేఏసీ వినతి


 దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలి – కోనసీమ క్రైస్తవ జేఏసీ వినతి

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని, క్రైస్తవులపై దాడులు అరికట్టాలని కోరుతూ కోనసీమ క్రైస్తవ జేఏసీ నేతలు అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

డాక్టర్ విప్పర్తి రాజ్ కుమార్, ఎం. యెహోషువ ఆధ్వర్యంలో నోబెల్ రాయ్, యు.వి. భాస్కర్, స్పర్జనరాజ్, ఎన్. పాల్ జాన్ పాల్, మార్టిన్, ఆనంద్ కుమార్ తదితరులు ఎంపీని కలిసి తమ సమస్యలను వివరించారు. మతం మారితే కులం మారిపోయే విధానాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.

1950 ప్రెసిడెంటల్ ఆర్డర్‌ను తక్షణం రద్దు చేసి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సమస్యను ప్రభుత్వ దృశష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపించాలని ఎంపీని విజ్ఞప్తి చేశారు.

వారి వినతికి స్పందించిన ఎంపీ గంటి హరీష్ బాలయోగి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.