ప్రాచీన కళలకు కంబాల శ్రీనివాసరావు ప్రోత్సాహం


_కోలాటం గజ్జ పూజ కార్యక్రమానికి 1,50 వేలు రూపాయలు విరాళం__

తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ వాహిని గోకవరం డిశంబర్ 25: గోకవరం డ్రైవర్స్ కాలానికి చెందిన పలువురు మహిళలు మన ప్రాచీన కాలం నాటి అద్భుతమైన కళలో ఒకటైన  కోలాటం నృత్యాలను  నేర్చుకుంటున్నారు. కోలాటం నేర్చుకున్న అనంతరం గజ్జపూజ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించాలని,  డ్రైవర్ కాలనీకి చెందిన పలువురు మహిళలు విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి ఇటీవలే కోరారు.  స్పందించిన ఆయన మన ప్రాచీన కళలను ప్రోత్సహించాలne సంకల్పంతో వారికి 1,50,000  రూపాయలు విరాళం ప్రకటించారు. ఆ విరాళం చెక్ ను గోకవరం సీఎండీ కార్యాలయం వద్ద మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలు, కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, మనందరిపై ఉందన్నారు. వాటి ప్రోత్సాహానికి తాను ఎల్లప్పుడు సహాయ, సహకారాలు  అందిస్తానన్నారు._