అమలాపురం మున్సిపాలిటీ వారు నిర్మించిన కొత్త సీసీ రోడ్


అమలాపురం సావరంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి అమలాపురం మున్సిపాలిటీ వారు నిర్మించిన కొత్త సీసీ రోడ్డునకు పాత సీసీ రోడ్డునకు ఎత్తులో వ్యత్యాసం కనీసం అడుగున్నర ఉండగా, పాత సిసి రోడ్డును కొత్త సీసీ రోడ్డును కలుపుటకు గాను ఎర్ర కంకర మట్టిని ఉపయోగిస్తున్నారు.  వచ్చే ఈ వర్షాకాలంలో సీసీ రోడ్లపై జాయింట్లను పూడ్చడానికి లేదా కలపడానికి ఎర్ర కంకర మట్టి వర్షానికి కొట్టుకుపోకుండా ఉంటుందా, అడుగున్నర ఎత్తిన కొత్త రోడ్డును పాత సిసి రోడ్డుకు అనుసంధానించడానికి ఎర్ర కంకర మట్టి ఉపయోగించవచ్చు అని నిరూపించి, అమలు చేస్తున్న అమలాపురం మున్సిపాలిటీ వారిని పట్టణ ప్రజలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. కోట్లాది రూపాయలు ప్రజాధనం వెచ్చించి మొదలుపెట్టిన పనులను పూర్తి చేయకుండా ఇలాగే వదిలేయడం పట్ల అటు ముస్లిం వీధిలోని ఉన్నటువంటి ప్రజలు కూడా తమ శుభాకాంక్షలు మున్సిపాలిటీ వారికి తెలియజేస్తున్నారు.