విదసం నేత డాక్టర్ బూసి డిమాండ్....
లోకేశ్ గారూ అట్రాసిటీ కేసులు కూడా రెడ్ బుక్ లో పెట్టండి..
కుందాలపల్లి కాటికెళ్ళే దళితుడి అంతిమయాత్ర పై దాడి కి తెగబడ్డ దోషులను జైళ్లో పెట్టాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు..
కుందాలపల్లి అట్రాసిటీ దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బాధితులు, అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత సంఘాల ఛలో అమలాపురం నిర్వహించారు ..
ఈ సందర్భంగా వెంకట రావు మాట్లాడుతూ కుల రక్కసి నీ కూకటివేళ్లతో పెకిలించాలంటే తక్షణ అరెస్టుల కఠిన శిక్షలే మందు. కుందాల పల్లి దోషులను తక్షణమే జైళ్లో పెట్టాలన్నారు..
7 ఏళ్ల లోపు శిక్షా కాలం వర్తించే వ్యక్తిత్వ హననం చేసిన వారిని జైళ్లో పెట్టే పోలీసులు అంతకంటే తీవ్ర మైన కుల హననం ఎస్సీలపై అట్రాసిటీ దాడులు చేసే దురహంకారులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి మర్యాదలు చేస్తున్నారని అందుకే అంబేద్కర్ స్పూర్తి పొందిన కోనసీమ లో కూడా పదేపదే కులదాడులు జరుగుతున్నాయన్నారు.
ఇటీవల వ్యక్తిత్వం హననం , పబ్లిక్ కు ఇబ్బంది కల్పించారన్న నెరంతో అంబటి రాంబాబు ను ప్రభుత్వం జైళ్లో పెట్టిన సంగతి గుర్తు చేస్తూ అంబటి మీద పెట్టిన 126(2), 351(2) సెక్షన్లతో పాటు అట్రాసిటీ చట్టం వర్తించే కుందాలపల్లి దోషులను అరెస్టు చేయడంలో పోలీసులు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు . బొంతు రమణ మాట్లాడుతూ ఎస్సీలపై దాడులు జరుగుతున్నప్పుడు ముఖ్య మంత్రి, ఉప ముఖ్యమంత్రి సీరియస్ గా స్పందించక పోవడం వల్లే మూకలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు.. కుందాలపల్లి నీ కలెక్టరు ఎస్సీ సందరించలేదన్నారు .. కొంకీ రాజమణి మాట్లాడుతూ ఘటన జరిగిన 3 రోజులకు కాని కేసు కట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించడం చట్టరీత్యా నేరం అన్నారు..అట్రాసిటీ నిందితులనుకూడా రెడ్ బుక్ లో చేర్చాలని డిమాండ్ చేశారు... బీఎస్పీ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రేవు తిరుపతి రావు, గిడ్ల వెంకటేశ్వర రావు, మందా సత్య నారాయణ, ఎస్ తులసి, బాబురావు, గుడివాడ ప్రసాద్, నాగరాజు, గోడి వెంకటేశ్వర రావు, సన్యాసి రావు తదితరులు పాల్గొన్నారు..



Social Plugin