సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహం ఆవిష్కరణ సభలో మంత్రి సుభాష్

 అపర భగీరధుడు సర్ ఆర్థర్ కాటన్


 ఆధునిక సాగునీటి వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు


సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహం ఆవిష్కరణ సభలో మంత్రి సుభాష్




 కృష్ణ, గోదావరి  నదులపై  ఆనకట్టలు నిర్మించి  అన్నదాతల  పాలిట దేవుడుగా నిలిచిన  సర్ ఆర్థర్ కాటన్ దొర అపర భగీరధుడుగా చిరకాలం  గుర్తుండిపోతారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కె గంగవరం మండలం  మసకపల్లిలో  నూతనంగా ఏర్పాటు చేసిన  సర్ ఆర్డర్ కాటన్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, గోదావరి డెల్టా ఛైర్మెన్  మూరల శెట్టి సునీల్ కుమార్, వైస్ చైర్మన్  తమలంపూడి సుధాకర్ రెడ్డి, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్  సలాది రమేష్, బ్రహ్మపురి సొసైటీ అధ్యక్షులు గడ్డం పల్లపురావు  (బన్నీ)ల సమక్షంలో మంత్రి సుభాష్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ 

గోదావరి, కృష్ణా నదులపై ఆనకట్టలు, కాలువల నిర్మాణం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి, తెలుగు ప్రజల జీవితాల్లో సుసంపన్నత తీసుకువచ్చిన దూరదృష్టి గల ఇంజనీర్ అని ప్రశంసించారు. రైతుల కష్టాలను అర్థం చేసుకుని, వ్యవసాయాభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన కాటన్ దొర సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ఈ విగ్రహ ఆవిష్కరణ ద్వారా నేటి తరం ఆయన సేవలను స్మరించుకోవడమే కాకుండా, భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. గోదావరి డెల్టా ఛైర్మన్ మూరలచెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ 

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ  ఎంతో దూర దృష్టితో ఆనకట్టలు నిర్మించి అన్నదాతల గుండెల్లో  సర్ ఆర్థర్ కాటన్ గూడు కట్టుకున్నారని కీర్తించారు. జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ గోదావరి డెల్టా ప్రాంతా రైతాంగం, ప్రజలు సర్ ఆర్డర్  కాటన్ కు రుణపడి ఉంటారని, ఆయన సేవలు స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. 

ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, బిజెపి మండల అధ్యక్షులు కొప్పిశెట్టి చంద్రరావు, రేవు శ్రీను, కాటే సుబ్రహ్మణ్యం, అధికారులు, డీసీలు, టీసీలు, సొసైటీ డైరెక్టర్లు,రైతులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మపురి ప్రాథమిక  వ్యవసాయ సహకార పరపతి సంఘం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను  మంత్రి సుభాష్, ముఖ్య అతిథులు చేతుల మీదుగా  ఆవిష్కరించారు.