అమలాపురం: వడ్డిగూడెం మన్నా జూబ్లీ చర్చ్ లో పాస్టర్ కె.భాస్కర్ రావు ఏర్పాటు చేశారు. సెక్రెటరీ: డి.డానియల్, ప్రెసిడెంట్: బ్రదర్ యస్.నోబెల్ రాయ్ అధ్యక్షతన జరిగింది. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ సెక్రెటరీ: పాస్టర్ యెహోషువ దైవజనుల ఐక్యత క్షేమం కొరకు ప్రార్థన చేశారు. అమలాపురం యూ.పి.ఎఫ్ జోన్ చైర్మన్ రెవ.గోలకోటి సత్య ప్రసాద్ వాక్య పరిచర్య చేశారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్ ఫెలోషిఫ్ అధ్యక్షులు: రెవ.కార్ల్ డేవిడ్ కొమనాపల్లి ఫెలోషిప్ ఐక్యత కొరకు మాట్లాడుతూ ఫెలోషిప్ అభివృద్ధి కొరకు పాటుపడాలని కోరారు. దైవ సేవకులు అందరూ ఐక్యతతో కలిసి సహవాసముగా ఉండాలని ప్రజలకు సేవ చేయు వారిగా దేశము, రాష్ట్రములు, జిల్లాలు, మండలాలు కొరకు మరియు పరిపాలించుచున్న నాయకులు పాలకులు కొరకు ప్రార్థన చేయాలని తెలియజేశారు.
పాస్టర్ భాస్కర రావు కుమారుడు డాక్టర్ రఘు & సింధు పెళ్లిరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారిని ప్రార్థనతో ఆశీర్వదించారు. కొత్త కమిటీ వారు ప్రెసిడెంట్: బ్రదర్.నోబెల్ రాయ్, వైస్ ప్రెసిడెంట్: రెవ.ఆనందరావు, సెక్రెటరీ: రెవ.డేనియల్, జాయింట్ సెక్రెటరీ: రెవ.సామ్యేల్ ట్రెజరర్: బ్రదర్.జోసఫ్, జాయింట్ ట్రెజరర్: రెవ.ప్రసాద్ పాత కమిటీ వారు చేసిన సేవలను గుర్తించి సన్మానించి, మెమోంటోస్ అందజేశారు.
నూతనముగా ఎన్నికైన కమిటీ నాయకులను జిల్లా, జోన్, మండల నాయకులు సన్మానించారు. డాక్టర్ రఘు& సింధు గార్ల పెళ్లిరోజు సందర్భంగా వచ్చిన దైవజనులకు ఆదరణ పథకం నిమిత్తం కానుక గిఫ్టుగా అందజేశారు. విందుతో కార్యక్రమం ముగించబడింది.
Social Plugin