సేవకు మారుపేరు మదర్ థెరిస్సా: వైసిపి నేత రమణారావు


అమలాపురం: సేవకు మారుపేరు ప్రేమకు ప్రతిరూపంగా ప్రపంచాన్ని దయ కరుణతో నింపిన మదర్ థెరిస్సా ఆదర్శనీయమూర్తి అని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకుడు గుడ్ సీడ్ ఫౌండేషన్ ఫౌండర్ కుంచే రమణారావు అన్నారు. అమలాపురం గుడ్ సీడ్ ఫౌండేషన్ కార్యాలయంలో మంగళవారం మదర్ థెరిస్సా జయంతిని ఘనంగా నిర్వహించారు. 

మదర్ థెరిస్సా చిత్రపటానికి రమణారావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తన దేశం కాని దేశం భారతదేశంలో ఎంతోమంది అనాధలను అభాగ్యులను కుష్టు రోగులను తన సొంత కుటుంబీకులుగా భావించి అక్కున చేర్చుకుని సేవలందించిన మదర్ థెరిస్సా చరిత్రలో చిరస్మరణీయులుగా మిగిలిపోతారని రమణారావు కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో భీమనపల్లి సర్పంచ్ పెయ్యల రాజ్ కుమార్, ఉప్పలగుప్తం వైసిపి ప్రధాన కార్యదర్శి పినిపే జయరాజ్, పరమట రాజశేఖర్, పందిరి సుబ్బరాజు, నక్క సంపత్ కుమార్, నేరేడుమిల్లి శ్రీనివాసరావు, గంటా లక్ష్మీప్రసాద్, నేలపూడి సుగంధ కుమార్, కుంచే అర్జున్, పరమట రాజేష్, విప్పర్తి రమేష్, గణేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.