షెడ్యూల్డ్ కులాల క్రైస్తవులకు వ్యతిరేకంగావున్న 1950 ప్రెసిడెన్సియల్ ఆర్డర్ ను వెంటనే రద్దు చేయాలి


 డా.బి.అర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం: గడియార స్తంభం నుండి నల్ల వంతుని మీదుగా ఎర్ర వంతెన టిడిపి ఎమ్మెల్యే ఆఫీసు వరకు, మధ్యలో మోకాళ్లపై ప్రార్థనలు నిరసనలు, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి ఎస్పీ గారికి వినతి పత్రాలు, అంబేద్కర్ స్టాట్యూ కి వినతిపత్రం ఇచ్చి పూలదండలు వేశారు, క్రైస్తవ జేఏసీ నాయకులు.

దద్దరిల్లిన అమలాపురం ఇంచుమించుగా పదివేల మందికి పైగా వచ్చిన క్రైస్తవ సహోదరి, సోదరులు. క్రైస్తవ జెఎసి నాయకులు వి. రాజ్ కుమార్, ఎం యెహోషువ, కార్ల్ డేవిడ్ కొమనాపల్లి, వై. శ్రావణ్ కుమార్, ఎర్నెస్ట్, నోబుల్ రాయ్, జె. సువర్ణరాజు, సిహెచ్. దానియేలు, స్పర్జన్ రాజు, జయరాజ్, ఆనంద్ కుమార్, ఎన్. పాల్, నవీన్ కుమార్, శాంతి రాజు, జకర్యా, భాస్కరరావు, విక్టర్ నందా, ఇమ్మానుయేలు, సుందరం, సత్య ప్రసాద్, నానిబాబు, అమృతరావు, జాన్ పాల్, డేవిడ్ రాజ్, కిషోర్, జాన్ మోజేష్, జార్జ్ పాఫఫ్, చెల్లి ఏసూరత్నం, బాబు సైమాన్.




జిల్లా పాస్టర్స్  ఫెలోషిప్లు యుపిఎఫ్, కెపిడబ్ల్యు, ఇస్సాకు ఫౌండేషన్, ఎఫ్ ఎఫ్ సి ఐ, టౌన్ యూత్, జిల్లా నాయకులు, జిల్లాలో 22 మండలాల ప్రెసిడెంట్స్ నియోజకవర్గాల చైర్మన్సు, ఉమెన్స్ ఫెలోషిప్, క్రైస్తవ సంఘాలు, దళిత సంఘాలు నాయకులు కమిటీలు పెద్దలు వేలాదిమందిగా తరలివచ్చి 1950 ప్రెసిడెన్సియల్ ఆర్డర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.