బిసి లు అప్రమత్తం కావాలి.
బిసి ల అట్రాసిటీ ముసాయిదా బిల్లు వారి ఆత్మ గౌరవ భవిష్యత్ కు ప్రమాదం .
బి సి లపై జరుగుతున్న విష పూరిత కుట్రను గమనించకపోతే అత్యంత ప్రమాదం పొంచి వుంది. తస్మాత్ జాగ్రత్త .
అనాదిగా దళితులపై జరిగినఒక కుట్ర నేడు బి సి లపై జరుగుతుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్తాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ నేడొక ప్రకటన ద్వారా హెచ్చిరించారు ..
ఏ ప్రాతిప్రదికన బిసి లకు అట్రాసిటీ చట్టం రూపొందిస్తున్నారో చెప్పె దమ్ము కూటమి సర్కార్ కు వుందా !
బి సి లకు ముసాయిదా బిల్లు అంటే మరో 100 ఏళ్లు అంటరాని వారిగా ముద్ర వేయటం వంటిది కాదా ! బిసి లు అంటరాని వారు మాకు కుల దూషణ చట్టం కావాలి అని బిసి వర్గాల వారు చంద్రబాబు కూటమిని అడిగారా ! కాపులను బిసి కేటగిరిలో కలపండి అని ఎన్నో ఉద్యమాలు చేస్తున్న కాపుల గోడు చంద్రబాబు కూటమికి పట్టటం లేదు . బిసి లు అంటరాని వారు , అస్ప్రస్సులు అని కొన్ని శతాబ్దాలు వెలివేసే కుట్రలో భాగమే నేడు బిసి ముసాయిదా బిల్లు . బిసి లు రాజ్యాలు ఏలిన వారని చంద్రబాబు కూటమి గుర్తుంచుకోవాలి .
బి సి లపై చిత్తశుద్ధి వుంటే రాజకీయ - ఆర్ధిక రిజర్వేషన్ కల్పించండి .
దళితులు - బిసి లు నిజమైన అగ్రవర్ణ జాతులు కాదని నిరూపించే దమ్ము వుందా !
మనుదర్మం ఆధారంగా ఒక అబద్దాన్ని నేటి దళితులపై - బిసి లపై అనాదిగా రుద్దుతూనే వున్నారు .
అంబేద్కర్ నిజంగా దళితులు అంటరాని వారని పోరాడారా ! హక్కులు కోసం పోరాడారా అనే నిజాన్ని దశబ్దలుగా దాచి పెట్టడం నిజం కాదా !
ఆనాడే అంబేద్కర్ కుల రిజర్వేషన్స్ కాకుండా సంపదలో రిజర్వేషన్ అడిగి వుంటే నేడు సంపన్న వర్గాలుగా విర్రవీగుతున్న వారిలో అనేకులు కుల రిజర్వేషన్ కేటగిరిలో వుందురు. కాదంటారా !
అంబేద్కర్ చేయని కుల ఉద్యమాన్ని నేడు ఆ మహానేత ను అడ్డు పెట్టి మెజార్టీ సంపన్న వర్గాలు దళితులు - బిసిల శ్రమను దోచుకోవటం నిజం కదా !
ఒక ప్రక్క కార్పొరేట్ మీడియా - మరో ప్రక్క కార్పొరేట్ రాజకీయ పార్టిలు - కొన్ని వ్యాపార కార్పొరేట్ దిగ్గజాల సుడిగుండంలో నలిగిపోతున్న దళిత, బిసి, మైనారిటీలు మేల్కొవాలి. సంపన్నులుగా అభివృద్ధి చెందాలి .
నిజానికి కుల ఉద్యమాలు ప్రస్తుత సంపన్న వర్గాలకు లాభదాయక ముడి సరుకు వంటిది . కుల ఉద్యమాలు ఉన్నంత వరకు చంద్రబాబు - వై ఎస్ ఆర్ కుటుంబాలకు తిరుగులేదు .
దళిత - బిసి లది గొప్ప చరిత్ర అయినప్పటికీ కొన్ని తరాలు ఒక అబద్దాన్ని తరాలు కొనసాగిస్తూనే వున్నారు . వారిని ఒక అంటరాని వారిగాను , వెనక బడిన వర్గాలుగాను ఆ వర్గాలు కుత్రిమంగా మానసిక వికలాంగులుగా బ్రతికేయటానికి అలవాటు పడిపోయేలా చేస్తూనే వున్నారు . కుల రిజర్వేషన్ లేకుంటే బ్రతుకుకు లేదేమో అనే అపోహను కార్పొరేట్ రాజకీయ పార్టిలు కార్పొరేట్ మీడియా సంస్థలతో కుత్రిమ ప్రచారం చేయనే వున్నారు . నిజానికి రిజర్వేషన్ కులానికి కాదు సంపదకు అని తెలుసుకున్న నాడు ఈ కార్పొరేట్ రాజకీయ, మీడియా వర్గాలకు నేపాల్ , శ్రీ లంక పరిస్థితులు తప్పవన్నారు .
దళితులు - బిసి ల చరిత్ర కోసం చెప్పటానికి ఏ ఒక్క మీడియా లేదు. పురాతన గ్రంధాలాయాల్లో వారి చరిత్రను నేడు కనపడనీయరు .
దళితుల్లోను - బిసి ల్లోను క్షత్రియ తెగలు వున్నాయి . ఆ గొప్ప వైభవం మాకు వద్దు, మా బిడ్డలకు వద్దు మాకు కుల రిజర్వేషన్స్ మాత్రమే కావాలి అనే విధంగా ఒక అబద్దాన్ని అనాదిగా నడిపిస్తున్నారు . దళిత - బిసి - మైనార్టీ ల శ్రమను దోచుకుంటున్నారు ..
మేధావులు దృష్టి సారిస్తే కుల ఉద్యమాలు , కుల రిజర్వేషన్స్ తో ఇప్పటి వరకు కోల్పోయినది . భవిష్యత్ లో నష్ట పోయేది అర్ధమవుతుంది .
ప్రస్తుతం బిసిల అట్రాసిటీ చట్టం , ముసాయిదా బిల్లు చాక్లెట్ చేతికి ఇచ్చి మొత్తం భవిష్యత్ ను దోచుకోవటం వంటిది .
బి సి ల ముసాయిదా బిల్లు అంతర్గత కుట్రను లోతుగా పరిశీలిస్తే చరిత్ర రహిత సంపన్న కార్పొరేట్ శక్తుల కాలకుట విష పూరిత కుట్ర అర్ధం అవుతుంది .
ఈ బిసి ముసాయిదా బిల్లు లక్ష్యం నిజాన్ని నమ్మనీయదు. భవిష్యత్ ను కాపాడుకోనీయదు . ఈ బిల్లు బిసి ల భవిష్యత్ ను పెరగనీయదు . అలా అని బ్రతకనీయదు . నిత్యం పేదరికం , ప్రభుత్వ సంక్షేమ పథకాలు తోనే జీవితం ఉంటూనే ఉంటుంది .
బ్రతకనీయదు . చావనీయదు . కుమిలిపోతు చరిత్ర లేని పాలకుల దయా దాక్షిణ్యాలపై చేతులు చాచి అర్జీస్తు మన రాజకీయ కట్టప్ప వలే బ్రతకటమే ఈ ముసాయిదా బిల్లు ఆంతర్యాన్ని తెలుసుకోవాలన్నారు .
ఈ కుట్ర అంత సులువుగా కొన్ని వర్గాల మేధావులకు అర్ధం కాదు. మొత్తం జీవితం చంకనాకి పోయినా అర్ధం కాకపోవచ్చును . నమ్మకమైన నాయకత్వమే దళిత, బిసి, మైనార్టీ ల భవిష్యత్ కు బంగారు బాటగా నిలుస్తుంది .
ప్రస్తుతం చెప్పుకుంటున్న కుల కేటగిరి ల మూలంగా లబ్ది పొందింది ఏమైనా వుందా ! అని ఆత్మ విమర్శ చేసుకోవాలి . నష్ట పోయింది. నష్ట పోతుంది ఏమిటో ఇప్పటికైనా గమనించగలరా ! సంపద , పాలన , గత వైభవ చరిత్ర దళిత, బిసి లదని గుర్తించండి . నేటి పాలక వర్గాలది ఆది ఆంకుర నాటి అంటరాని వారాని , సంపద లేని కటిక పేదలు అనే ఆది అస్పృస్యులనే నిజాన్ని గ్రహించే రోజులు ఆ వర్గాల మదిలోనే వుందని గ్రహించి బిడ్డల భవిష్యత్ కు మార్గదర్శకులుగా నిలవాలన్నారు .
అంటరాని తనం , వెనుకబడిన తనం నేడు సంపద తోనే వుంది . కుల, వంశ చరిత్రతో పని లేదు . మాదిగలు ఆది చరిత్రలో క్షత్రియులు గాను , మాలలు యుద్ద యోధులు గాను , బిసిల్లో అనేకులు క్షత్రియులు , ప్రకృతి మెచ్చిన వర్ణాలుగాను వారి ఆది చరిత్ర చెబుతుంది .
ప్రస్తుత పాలకులకు ఏ గొప్ప చరిత్ర వుందో , వాటి ఆదారాలను చెప్పగలరా ! అబద్దపు చరిత్రకు రంగు పూయటం తప్ప మరొకటి లేదు ..
పాలకుల కుట్రలో బిసి లు బలిపశువులుగా మారుతున్నారు . ఇప్పటివరకు బీసీ లు వెంకబడిన వారిగా వున్నారు . అట్రాసిటీ ముసాయిదా బిల్లు కారణంగా ఇక నుండి అంటరాని వారిగా వివక్షలకు గురవుతూనే వుంటారు . ఆ ప్రభావం బి సి వర్గాల బిడ్డలపై పడుతూనే ఉంటంది . నిరంతరం వివక్షకు గురవుతూనే వుంటారు . నాడు దళితుల పై జరిగిన విష పాచిక నేడు బిసి లపై ప్రయోగించే కుట్ర జరుగుతుంది .
పాలక వర్గాలు , పాలకుల బిడ్డలు సంపదలో జీవిస్తుంటారు . దళితులు , బిసి , మైనార్టీ లు అంటరాని వారిగాను , వెనకబడిన వారిగాను అసంతృప్తి జీవితాలకు బానిసలుగా మారటం తప్ప మరో మార్గం ఉండదు .
బిసి లకు ఎవరు అడిగారు . అట్రాసిటీ ముసాయిదా బిల్లును పాస్ చేయమని ఎవరు అడిగారు ఈ కూటమి సర్కార్ ను
బి సి లకు గేలం వేటమే లక్ష్యంగా రాజ్యాంగ చట్ట బద్దత లేని ముసాయిదా బిల్లుతో బిసి ల భవిష్యత్ పై కుట్ర చేస్తున్నారు .
బిసి ల భవిష్యత్ పై జరుగుతున్న ఈ కుట్రకు సంబందించి చర్చించగల ఏ పాలక మేధావి తోనైనా నేను చర్చకు సిద్దం . చర్చకు సిద్దపడే దమ్మున్న పాలక మేధావులకు మేడా శ్రీనివాస్ భహిరంగ సవాల్ చేస్తున్నారు ..
--మేడా శ్రీనివాస్ , MA, LLM, MA(జర్నలిజం) MA (Mjmc)
వ్యవస్తాపక అధ్యక్షులు ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్



Social Plugin