రామచంద్రపురంను కాకినాడ జిల్లాలో కలపాలని ద్రాక్షారామ యానాం సెంటర్లో పట్టణ ఆటోయూనియన్లు పెద్దఎత్తున నినాదాలు చేసారు, జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు మాట్లాడుతూ గంగవరం మండల ప్రజాపరిషత్,రామచంద్రపురం మండల ప్రజాపరిషత్లు, రెండు మండలాలు పరిదిలోని అన్ని పంచాయతీలు తోపాటు రామచంద్రపురం మున్సిపాలిటీలు రామచంద్రపురం నియోజకవర్గంను కాకినాడ జిల్లాలో కలపమని ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వంకు సమర్పించినను పట్టించుకోకుండా ప్రజాస్వామ్యంను రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినందున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకు పాలాభిషేకం చేసి నాయకులుకు ఇప్పిటికైనా కనువిప్పు కలగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెంటుపల్లి భీమశంకరం, రాజారెడ్డి, టీడీపీ నాయకులు ఆకుల కొండ బాబు,అందెబుజ్జి, ఆదినారాయణ,సత్యనారాయణ, జూనీ, పెద్దలోవ, జ్యోతిబాబు తో పాటు అధికసంఖ్యలో ఆటోకార్మికులు పాల్గొన్నారు.


Social Plugin