దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ...


 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా  క్రైస్తవ జేఏసీ నాయకులు ఈ రోజు అల్లవరం మండలం గోడిలోని ఎమ్మెల్సీ గారి క్యాంప్ కార్యాలయం నందు  ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు శ్రీ బొమ్మి ఇజ్రాయిల్ గారిని కలిసి దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం జరిగింది. 

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రిస్టియన్ల పై దాడులు పెరిగిపోయాయి అని, క్రిస్టియన్లకు రక్షణ లేకుండా పోయిందని జిల్లా జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి అని 1950 రాష్ట్రపతి ఆర్డర్ రద్దు చేయాలి అని కోరారు.

ఇక్కడతో ఈ పోరాటం ఆగదని, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేవరకు క్రైస్తవ ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఇజ్రాయిల్ గారు మాట్లాడుతూ రాబోయే శాసన మండలి సమావేశాల్లో ముఖ్యంగా ఈ సమస్య గురించి ప్రస్తావిస్తానని, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించడంలో నా వంతు సహాయం చేస్తానని ఈ సందర్భంగా జేఏసీ నాయకులకు హామీ ఇవ్వడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో క్రైస్తవ జేఏసీ నాయకులు  నోబుల్ రాయ్,యెహోషువ, యు.వి భాస్కరరావు, స్పర్జన్ రాజు, ఎం. జాన్ పాల్, పీ మార్టిన్, ఎన్.పాల్ రాజు తదితరులు పాల్గొన్నారు.