“చలో అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా ను జయప్రదం చేయండి – సిపిఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపు
కె.గంగవరం మండలం పాతకోట గ్రామంలో స్థానిక డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం (ఎ ఐ కె ఎం స్) ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్ధూ మాట్లాడుతూ
రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలోనే కొనసాగిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
ప్రజల సౌలభ్యం, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రెండు కీలక డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 27న “చలో అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు కూర్మా కొండయ్య, జనిపల్లి ప్రసాద్,, చెల్లె లక్ష్మి, మల్లిడి జార్జి, గుంటూరు సూర్యారావు, చెల్లె రజనీ, పాము బాలమ్మ , నీతిపూడి లక్ష్మి, పచ్చి మాల లలిత కుమారి, దానం కొండ తదితరులు పాల్గొన్నారు.

Social Plugin