జిల్లా పోలీస్ కార్యాలయం,
డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లను స్టేషన్లకు పిలిపించి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
🛑 కౌన్సిలింగ్ ముఖ్య ఉద్దేశాలు:
👉శాంతిభద్రతల పరిరక్షణ: జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరోధించడం.
👉మార్గనిర్దేశం: రౌడీ షీటర్లు పాత నేర చరిత్రను విడిచిపెట్టి, మంచి జీవనం గడిపేలా వారికి మార్గనిర్దేశం చేయడం.
👉హెచ్చరిక: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా హెచ్చరించడం.
👉జీవనోపాధి: నేరాలకు దూరంగా ఉంటూ గౌరవప్రదమైన జీవనోపాధిని ఎంచుకోవాలని వారికి సూచించడం.
ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారు మాట్లాడుతూ, "జిల్లాలో ఎలాంటి అసాంఘీక శక్తులు, రౌడీయిజం, గూండాయిజంలకు తావు లేకుండా చూస్తాము. నేరాలకు పాల్పడే వారిపై, పాత నేరాలను పునరావృతం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోము. ఈ కౌన్సిలింగ్ ద్వారా వారు తమ ప్రవర్తనను మార్చుకుంటారని ఆశిస్తున్నాము," అని తెలిపారు.



Social Plugin