ధాన్యం సొమ్ములు చెల్లించడంలో మండపేట రాష్ట్రంలోనే నెంబర్ 1

రైతులకు గిట్టుబాటు ధర చెల్లించడమూ ఆనందంగా ఉంది.

మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ


గతం లో ఎప్పుడూ లేని విధంగా 24 గంటల్లోనే రైతులకు సంపూర్ణంగా ధాన్యం సొమ్ములు చెల్లించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు గారు అన్నారు. మండపేట తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కోనసీమ జిల్లా ధాన్యం సేకరణ లక్ష్యం మూడున్నర లక్షల టన్నులు కాగా ఇప్పటికే దాదాపు మూడు లక్షల టన్నుల సేకరణ పూర్తి కావడం జరిగిందన్నారు. ఇందులో మండపేట నియోజకవర్గ లక్ష్యం 99,314 టన్నులు కాగా ఇప్పటికే 98,260 టన్నుల సేకరణ పూర్తయిందన్నారు. ముఖ్యంగా ప్రతి రైతుకు గిట్టుబాటు ధరతో పాటు చెల్లించాల్సిన మొత్తం డబ్బులను ప్రభుత్వం చెల్లించడం జరిగిందన్నారు. మండపేట నియోజకవర్గంలో రైతులకు 232 కోట్లు చెల్లించి రాష్ట్రం లోనే మండపేట మొదటి స్థానం లో నిలవడం జరిగిందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వ పటిమ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ గార్ల సహకారమే కారణమన్నారు. రైతుల సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ఇందుకు అన్ని విధాలా సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, టీడీపీ నాయకులు మచ్చా నాగు, వాదా ప్రసాదరావు, కొవ్వాడ అప్పన్నబాబు, వ్యవసాయ శాఖ అధికారులు చౌదరి తదితరులు పాల్గొన్నారు.