పల్లంకుర్రులో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే బుచ్చిబాబు….




పల్లంకుర్రులో 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే బుచ్చిబాబు….

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లంకుర్రు గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాన్ని అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అందులో భాగంగా పల్లంకుర్రు గ్రామంలో ఈ విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఈ ఉప కేంద్రం వల్ల చుట్టూ ప్రక్కల గ్రామాలకు విద్యుత్ వోల్టేజీ సమస్యలు తీరతాయన్నారు. అలాగే ప్రజలకు భవిష్యత్తులో నాణ్యమైన, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బుచ్చిబాబు తో కలిసి కృషి చేస్తానని ఎంపీ హరీష్ బాలయోగి పేర్కొన్నారు.