👉గడిచిన 20 రోజులుగా సముద్ర భూగర్భం నుండి అక్రమ బొండు మట్టి తవ్వకాలు
👉అటువైపు కన్నెత్తి చూడని ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు
👉అన్ని శాఖల వారికి ముడుపులు అందుతున్నాయని నియోజకవర్గ ప్రజల్లో వినిపిస్తున్న గుసగుసలు
👉 అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం రాఘవలపేట సమీపంలో సి ఆర్ జెడ్ పరిధి భూముల నుండి బొండు మట్టి త్రవ్వకాలు భారీ యంత్రాలతో టిప్పర్ లారీలతో తరలిస్తున్నారు.
👉 జనసేన పార్టీ నాయకుడు అండదండలతో బొండు మట్టి ఇసుక మాఫియా జరుగుతున్నట్లు సమాచారం. ఒకవైపు సముద్రతీర ప్రాంతాలను ముంచేత్తుతున్న ఆగని బొందుమట్టి,ఇసుక మాఫి దంద....
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అమలాపురం నియోజకవర్గం
ఉప్పలగుప్తం మండలం
సూరసేని యానం గ్రామం రెవెన్యూ అధికారి,( VRO )
ఉప్పలగుప్తం మండల రెవెన్యూ అధికారిని, (MRO) పర్యవేక్షణలో అక్రమ బొండుమట్టి, ఇసుక మాఫియా.....
బొండుమట్టి, మరియు ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలు మీడియాలో వస్తున్నా, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా....
సూరసేని యానం గ్రామం రెవెన్యూ అధికారి,( VRO ) ఉప్పలగుప్తం మండల రెవెన్యూ అధికారిని, (MRO)
అధికారులకు చరవాణి (మొబైల్ ఫోన్) ద్వారా ప్రజలు సమాచారం అందించిన పట్టించుకున్న పాపాన లేదు....
రాఘవలపేట గోదావరి నదీ పాయ బ్రిడ్జి కి పది మీటర్ల దూరంలో తవ్వకాలు...
బొండు మట్టి, మరియు ఇసుక తవ్వకాలు వల్ల సముద్రతీరం దిశ మారి నది కోత ఎక్కువ అవుతుంది. ఫలితంగా నదీ కోత శ్రుతిమించి తమ సారవంతమైన భూములు నదీ గర్భంలో కలిసిపోతాయని రైతులు ఆవేదన...
రాష్ట్ర వ్యాప్తంగా రేవులన్నింటినీ మూసేసిన గనుల శాఖ ముందస్తుగా ప్రతి నియోజకవర్గంలోనూ ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏ అవసరానికైనా సరే నిల్వ కేంద్రం నుంచే ఇసుక తీసుకెళ్లాలి తప్ప నదిలో తవ్వకాలు చేయకూడదు. కానీ జిల్లా లోని ఉప్పలగుప్తం మండలంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది.
బహిరంగ రీచుల లోనే వెళ్లే ట్రెంచులు త్రవ్వి నిషేధపు చర్యలు చేసిన ఆగని ఇసుక తవ్వకాలు
గోదావరి నదీతీరంలో జూన్ 8వ తేదీ నుండి ఇసుక తవ్వకాలు నిలిపేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను గాలికొదిలేసినట్టు పరిస్థితి కనిపిస్తోంది.
జూన్ 1వ తేదీ నుంచి తవ్వకాలపై నిషేధం ఉన్నప్పటికీ దోపిడీ జోరుగా జరుగుతోంది. గోదావరి గర్భాన్ని ఇసుకాసురులు గుల్ల చేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి సముద్ర గర్భం నుంచి భారీ యంత్రాలతో టిప్పర్ లారీలతో బొండు మట్టి, మరియు ఇసుక తీసుకువచ్చి టాక్టర్ల ద్వారా తరలింపు జోరుగా సాగుతోంది.
గత 20 రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా బొండు మట్టి మరియు ఇసుక అక్రమ త్రవ్వకాలు వందల సంఖ్యలో టిప్పర్ లారీలతో, ట్రాక్టర్లుతో బొండు మట్టి, మరియు ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు.
అయినప్పటికీ, గ్రామ ,మండల స్థాయి అధికారులు ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు....
సముద్ర భూగర్భం గర్భం నుంచి బొంగు మట్టి, ఇసుక తరలిస్తున్న దళారులపై, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు గ్రామ, మండల స్థాయి అధికారులు పై, చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
బొండు మట్టి,ఇసుక మాఫియా అక్రమ తవ్వకాలు మీడియాలో వస్తున్నా, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన లేదు....

Social Plugin