గ్రామ ఉద్యానవన కార్యక్రమంలో సర్పంచ్. సతీష్ రావు

 గ్రామ ఉద్యానవన కార్యక్రమంలో సర్పంచ్. సతీష్ రావు 


రామచంద్రపురం మండలం హసన్ బాద గ్రామంలో సర్పంచ్,రాష్ట్ర బిజెపి కిసాన్ మోర్చ కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు అధ్యక్షతన గ్రామ ఉద్యానవన సహాయకారిణి నిర్వహణలో డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని స్ధానిక రైతులు,కౌలు రైతుల అభినందన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతుల సేవను, కృషిని గుర్తించే ప్రత్యేక దినంగా, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినాన్ని,జాతీయ రైతు దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని, మన దేశం వ్యవసాయాధారిత దేశమని 50 శాతం పైగా జనాభా దీనిపై ఆధారపడుతున్నారని, భారత దేశ జి.డి.పి.వ్యవసాయం 15శాతం నుండి 18శాతం సహకరిస్తుందని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల స్వయం సమృద్ధి పై దృష్టి సారించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి వ్యవసాయ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అనేక రైతుల సంక్షేమ కార్యక్రమాలు అభినందనీయమని సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు కొనియాడుతూ,అందరూ కలసి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఈ సందర్భంగా విచ్చేసిన గ్రామ పెద్దలు రైతులు చింతపల్లి వీరభద్రరావు,చోడిశెట్టి వీరభద్రరావు,కౌలు రైతు రమణ తదితరులను సర్పంచ్ ఘనంగా సత్కరించి వారికి అభినందలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు,గ్రామస్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.