ప్రజల రక్షణే ద్యేయంగా పోలీసులు మెలగాలి

 విధి నిర్వహణలో పోలీసులు అంకిత భావంగా ఉండాలి

కొత్తపేట డివిజన్ డీఎస్పీ సుంకర మురళి మోహన్ 


ప్రజల సంరక్షణే పరమావధిగా, విధి నిర్వహణలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుండాలని కొత్తపేట డివిజన్ డీఎస్పీ సుంకర మురళి మోహన్ ఉద్ఘాటించారు. శుక్రవారం ఆయన రాజోలు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, స్టేషన్ పరిధిలోని వివిధ రికార్డులను నిశితంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాజోలు సీఐ నరేష్ కుమార్, ఎస్‌ఐ బి. రాజేష్ కుమార్‌లను ఆదేశించారు. అలాగే, స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సీజ్ చేసిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా డీఎస్పీ సుంకర మురళి మోహన్ మాట్లాడుతూ, పోలీసులు తమ విధులలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే పౌరులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గ్రామీణ ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.