రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కొనసాగించాలని కౌన్సిల్ తీర్మానం

 



రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కొనసాగించాలని కౌన్సిల్ తీర్మానం తీర్మానం చేసింది.

 రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం గురువారం కౌన్సిల్ హాల్ లో చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీ దేవి అధ్యక్షతన జరిగింది. రాష్ట్రం లో మండలాలు, జిల్లాలు పునర్విభజనలో భాగంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే నెల రోజులు లోగా వారియొక్క హోదాతో కూడిన అభ్యంతరాలు తెలియజేయాలని కోనసీమ జిల్లా కలెక్టర్ వారు గెజిట్ నోటిఫికేషన్ లో తెలియజేశారు. ఈ నేపథ్యంలో పట్టణ మరియు నియోజకవర్గ  ప్రజల అభీష్టం మేరకు వై. ఎస్. ఆర్. సి. పి. కి చెందిన 15 మంది కౌన్సిలర్లు, కో-ఆప్షన్స్ సభ్యులు సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఈరోజు జరిగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి టేబుల్ ఎజెండాగా తీసుకురావాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ కె. వి. ఆర్. ఆర్. రాజుకి అందజేశారు.

 మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు ఈ అంశాన్ని టేబుల్ ఎజెండాగా తీసుకురావడంతో RDO ఆఫీస్ ను కొనసాగించాలని.. కౌన్సిల్ తీర్మానించడమైనది..

 ఈ సమావేశంలో వైస్ చైర్మన్ లు కోలమూరి శివాజీ, చింతపల్లి నాగేశ్వరరావు, మున్సిపల్ చీఫ్ విప్ వాడ్రేవు సాయి ప్రసాద్, పలువురు కౌన్సిలర్లు.. పాల్గొన్నారు..