పశు సంరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి

 రూ. కోటి రూపాయలుతో  55 మినీ గోకులాలు ఏర్పాటు.


 కూటమి పార్టీ నాయకులు  వాసంశెట్టి సత్యం


కూటమి ప్రభుత్వం  పాడి, పశు సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తుందని  కూటమి పార్టీ సీనియర్ నాయకులు  వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. కె గంగవరం మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస రావు అధ్యక్షతన జరిగిన  సమావేశంలో  వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ కె గంగవరం  మండలానికి  ప్రభుత్వం కోటి రూపాయలకు పైగా  నిధులు కేటాయించి  55 మినీ గోకులాలు మంజూరు చేసింది అన్నారు. పశు సంరక్షణకు, పాడి పరిశ్రమ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ  నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఈ నిధులను రైతులు సద్వినియోగం చేసుకొని  సకాలంలో  పశువుల షెడ్ లు నిర్మించుకోవాలని సూచించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్  చొరవతో  రామచంద్రపురం నియోజవర్గానికి అధిక సంఖ్యలో మినీ గోకులాలు మంజూరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  ఎన్ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ ఏడి  రామకృష్ణ, ఏపీఓ సురేంద్రబాబు, ఎంపీపీ పంపన నాగమణి, గంగవరం మండలం టిడిపి అధ్యక్షులు  మేడిశెట్టి రవికుమార్, స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్  సలాది రమేష్, మండల జనసేన అధ్యక్షులు చిర్రా రాజకుమార్, నేమాని సత్యనారాయణ (అబ్బు), ఆనందరావు, దొరబాబు, మొరర్జీ, రైతులు  తదితరులు పాల్గొన్నారు.