ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి సుభాష్
రామచంద్రపురం: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి, నిత్యం ప్రజల సమస్యల స్వీకరణ కొనసాగించడమే కాకుండా, ప్రజల విజ్ఞప్తులు, ఫిర్యాదులు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. శుక్రవారం రామచంద్రపురంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్బంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేయడం జరుగుతుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి వారం గ్రీవెన్స్ డే’గా కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నమోదు చేసి, దాని పరిష్కారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ, ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు కమిటీ కార్యదర్శి సిర్రా సురేష్, అధికార ప్రతినిధి వనుం వీరబ్రహ్మం, కూటమి పార్టీ శ్రేణులు, అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు.

Social Plugin