విలేకరులు మైకు పట్టుకొని వస్తే మడతపెట్టి తన్నండి

 


ఇసంపల్లి వేణు సంచలన వ్యాఖ్యలు"

సమ్మయ్య గౌడ్‌పై దుష్ప్రచారం చేస్తే తోలు తీస్తాం: మీడియా అకాడమీ ఫెడరేషన్ వార్నింగ్"

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం వాడు.. ఆ యూట్యూబ్ 'నకిలీ' బాబా బండారం బయటపెడతాం!

జర్నలిస్టులపై పర్సనల్ ఎటాక్స్ సహించేది లేదు.. అవాస్తవాలు రాస్తే జైలుకే!

ఖబడ్దార్! మేడారం సమ్మయ్యపై తప్పుడు పోస్టులు పెడితే చట్టపరమైన వేటు తప్పదు.

బ్లాక్ మెయిలర్లకు జర్నలిజంలో చోటు లేదు.. ఆ యూట్యూబ్ ఛానల్‌ను మూయించేస్తాం.

తాగుబోతులకు, తిరుగుబోతులకు జర్నలిజం ముసుగు.. నకిలీల ఆగడాలపై ఇసంపల్లి వేణు ఫైర్"

నిజాయితీకి మారుపేరు సమ్మయ్య గౌడ్.. ఆయనపై కుట్రలు చేసేవారికి కాలం చెల్లుడే.

అక్రమ సంబంధాలు, బెదిరింపులే వృత్తిగా.. విలేకరి అవతారమెత్తిన వ్యక్తపై ఇసంపల్లి వేణు ధ్వజం.

అధికారులకు సూచన చేస్తూ:

అక్రెడిటేషన్ లేని నకిలీలను మీటింగ్స్‌కు రానివ్వకండి: 

అధికారులకు మీడియా అకాడమీ విన్నపం.

జర్నలిస్టులపై అవాస్తవ ప్రచారాలు చేస్తే ఖబడ్దార్: మీడియా అకాడమీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఇసంపల్లి వేణు హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాదులో ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. సీనియర్ జర్నలిస్ట్, 'మేడారం' పత్రిక ఎడిటర్ సమ్మయ్య గౌడ్‌పై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని

 తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత కక్షలు, రాజకీయ ద్వేషాలతో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తూ జర్నలిజం ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం:

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజ హితం కోసం నిరంతరం శ్రమిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పొందిన సమ్మయ్య గౌడ్ ఎదుగుదలను ఓర్వలేక కొందరు కుట్రలకు తెరలేపారని సోషల్ మీడియాలో వ్యంగ్య పోస్టులు ప్రచారం చేసిన అతడు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం లాంటివాడేనని వేణు మండిపడ్డారు. "సమ్మయ్య గౌడ్  ఒక తండ్రిలా హితబోధ చేసి, దారి చూపితే.. ఆయనపైనే బురద చల్లడం ఆరోగ్య మానసిక స్థితి లేని వారు పోస్టులు చేసినట్టు కనిపిస్తుందని ఆ పోస్టులను ప్రజలు నమ్మకూడదని ఆయన మనవి చేశారు.బ్రాందీ షాపులు, బెల్ట్ షాపుల వద్ద తిరుగుతూ ప్రజలను బెదిరించే స్థాయికి దిగజారిన వ్యక్తులు సీనియర్ల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నకిలీ విలేకరులకు చోటు లేదు. అతడు నకిలీ విలేకరే: యూట్యూబ్ ఛానల్ గొట్టం పట్టుకొని ప్రజల్లో తిరుగుతూ నేను విలేకరిని అని చెప్పుకోవడం చట్టరీత్యా నేరమని అలాంటి వారు సంఘంలో తిరిగితే మడతపెట్టి తన్నండి అని ఆయన అన్నారు.అక్రెడిటేషన్ కార్డు లేకుండా, జర్నలిజం విలువలపై అవగాహన లేకుండా యూట్యూబ్ ఛానెళ్లు పెట్టుకుని తిరుగుతున్న నకిలీ విలేకరుల పట్ల కఠినంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.తాగుడుకు, తిరుగుడుకు బానిసై:  మైకు పట్టుకుని వస్తున్న అరాచక శక్తులను సమాజం బహిష్కరించాలి. అలాంటి వ్యక్తులు మైకు పట్టుకుని వస్తే మడతపెట్టి తన్నండి"తాగుడుకు తిరుగుడుకు అలవాటుపడ్డ వాడే అని ఇసంపల్లి వేణు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

అక్రమ సంబంధాలు: అనైతిక ప్రవర్తన కలిగిన వ్యక్తులు జర్నలిస్టుల ముసుగులో చెలామణి అవుతుంటే, ప్రభుత్వ అధికారులు మరియు ప్రజాప్రతినిధులు వారిని ఏ మాత్రం దరిచేరనివ్వకూడదని కోరారు.

చట్టపరమైన చర్యలు తప్పవు:

సమ్మయ్య గౌడ్‌పై అవాస్తవ కథనాలు, వీడియోలు పోస్ట్ చేసిన వారు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో:యూట్యూబ్ ఛానెళ్లపై ఫిర్యాదు చేసి వాటిని శాశ్వతంగా స్తంభింపజేస్తాం.

 పరువు నష్టం దావాలతో పాటు చట్టం క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తుందని ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు.

జర్నలిస్ట్ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మయ్య గౌడ్‌కు అండగా: సత్యమే జయిస్తుంది.

జర్నలిజం అనేది సత్యం వైపు ఉండాలి కానీ కుట్రలకు వేదిక కాకూడదని వేణు గుర్తు చేశారు. శ్రీశ్రీ, వేమన పద్యాలను ఉటంకిస్తూ.. అబద్ధాలతో పబ్బం గడుపుకునే కలం తన విశ్వసనీయతను తానే కోల్పోతుందని హెచ్చరించారు. సమ్మయ్య గౌడ్ నిజాయితీని, ఆయన అందిస్తున్న సామాజిక సేవలను ఏ శక్తీ అడ్డుకోలేదని ఆయన స్పష్టం చేశారు.