ప్రజా సమస్యల పరిష్కార వేదిక...



 అమలాపురం   ఈనెల 29వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం జిల్లాస్థాయిలో స్థానిక కలెక్టరేట్  గోదావరి భవన్ నందు యధావిధిగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుం దని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కా రానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ  చేపట్టను న్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబం ధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని జిల్లా కలెక్టర్ కోరారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని. నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేం దుకు 1100 కి నేరుగా కాల్ చేయవచ్చునని ఆయన ప్రకటనలో తెలిపారు.