మాజీ ప్రధాని గౌరవ శ్రీ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవం

 


ది.28- 12- 2025 ఆదివారం ఉదయం 10 గంటలకు అంబాజీపేట బస్టాండ్ వద్ద గల మాజీ ప్రధాని గౌరవ శ్రీ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ 141 వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమమును అంబాజీపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, శ్రీ దొమ్మేటి వినోద్ అధ్యక్షతన జరపటమైనది. ఈ కార్యక్రమమునకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, శ్రీ మాచవరపు శివన్నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ 141 వఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ పతాకావిష్కరణ గావించి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా శివన్నారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిన సేవలను కొనియాడినారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశ ప్రజలకు ఉపయోగపడే నాగార్జునసాగర్ ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కర్మాగారం, డి ఆర్ డి ఓ, శ్రీహరికోట వంటి ఎన్నో పరిశోధనా కేంద్రాలు నెలకొల్పి దేశ ప్రజలకు అంకితం చేశారు.  ప్రస్తుతం నడుస్తున్న డబల్ ఇంజన్ ఎన్డీఏ సర్కార్ మాత్రం దోపిడీదారులకు, ఆర్థిక నేరస్తులకు కొమ్ముకాస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. బిజెపి ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరముల అయింది ఈ కాలంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారు తప్ప మన రాష్ట్రానికి సంబంధించిన తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి చేయలేకపోయినా అసమర్ధ ప్రభుత్వం దేశాన్ని పరిపాలిస్తుందని విమర్శించారు, దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరల అధికారంలోకి రావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలకు తెలియజేసినారు. 141 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ మహమ్మద్ ఇస్మాయిల్ షరీఫ్,  శ్రీ మలపర్తి మోహన రావు గార్లను సాలు వా కప్పి పూలమాలలు వేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి కొల్లి సరోజిని, శ్రీ మహమ్మద్ అబీబ్, శ్రీ బొంతు శివ, శ్రీ మట్టపర్తి వెంకటేశ్వరరావు, శ్రీ మట్టపర్తి శ్రీను, యుగంధర్ ఇతరులు పాల్గొన్నారు.