డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ గారి అధ్యక్షతన వార్షిక నేర సమీక్షా సమావేశం



జిల్లా పోలీస్ కార్యాలయం,

డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,

అమలాపురం.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ గారి అధ్యక్షతన వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలోని  కొత్తపేట, రామచంద్రపురం  మరియు అమలాపురం సబ్ డివిజన్లకు చెందిన డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు (CIs) మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOs) పాల్గొన్నారు.

👉​ఈ సందర్భంగా ఎస్పీ గారు పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు తీరును సమీక్షించి, అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలోని ముఖ్య అంశాలు:

👉​రోడ్డు ప్రమాదాల నివారణ: జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తగు సూచనలు చేయాలని ఆదేశించారు.

👉​సంక్రాంతి భద్రత: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు తమ సొంత ఊర్లకు వెళ్లే క్రమంలో ఇళ్ల వద్ద దొంగతనాలు జరగకుండా పోలీసుల గస్తీని పెంచాలని సూచించారు.

👉​అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం: జిల్లాలో ఎక్కడా గ్యాంబ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా సంక్రాంతి పేరుతో నిర్వహించే కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

👉​త్వరితగతిన దర్యాప్తు: పాత కేసులు మరియు పెండింగ్‌లో ఉన్న దర్యాప్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు

👉ప్రజలు పండుగ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తి లేదా సంఘటన కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ శ్రీ రాహుల్ మీనా గారు కోరారు.

ఈ ఈ కార్యక్రమంలో అమలాపురం డిఎస్పి శ్రీ టి ఎస్ ఆర్ కే ప్రసాద్ గారు మరియు కొత్తపేట డిఎస్పి శ్రీ సుంకర మురళి కృష్ణ గారు మరియు  రామచంద్రపురం డీఎస్పీ శ్రీ రఘువీర్ గారు మరియుడిసిఆర్బి సిఐ శ్రీ మురళీకృష్ణ గారు మరియు ఎ ఆర్ డి ఎస్ పి శ్రీ సుబ్బరాజు గారు  మరియు ఏ ఆర్ ఆర్ ఐ శ్రీ కోటేశ్వరరావు గారు మరియు ఏ ఆర్ ఆర్ ఐ శ్రీ బ్రహ్మానందం గారు  మరియు జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు మరియు సబ్ ఇన్స్పెక్టర్స్  అందరు పాల్గొన్నారు.