వాడివేడిగా అమలాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

 


సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రతిపాదన వ్యతిరేకిస్తున్నాం


వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు


మున్సిపాలిటీ అభివృద్ధిని అడ్డుకోవద్దన్న ఎమ్మెల్యే ఆనందరావు


సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రతిపాదన ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన కౌన్సిలర్ నాగేంద్ర


మున్సిపాలిటీ అభివృద్దే నా ధ్యేయం- అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు


మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అధ్యక్షతన శనివారం సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ 2025 26 సంవత్సరానికి సంబంధించి సుమారు 11 కోట్లు పన్నులు వసూలు చేయడం జరిగిందని, మున్సిపాలిటీ విస్తరిస్తే అభివృద్ధి చెందుతుందని, అన్నారు. మండపేట నిడదవోలు మున్సిపాలిటీలు సెకండ్ గ్రేట్ లో ఉన్నాయని, మన మున్సిపాలిటీ అర్హత సంపాదించామని, సెలక్షన్ గ్రేడ్ వస్తే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ తదితర శాఖల ద్వారా నిధులు బాగా వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ సెలక్షన్ గ్రేడ్ వల్ల మున్సిపాలిటీకి 20 నుండి 30 కోట్ల వరకు నిధులు వస్తాయని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావు మాట్లాడుతూ మున్సిపాలిటీ ని ప్రధమ శ్రేణి మున్సిపాలిటీ నుండి సెలక్షన్ గ్రేడ్  మున్సిపాలిటీగా అభివృద్ధి చేయుటకు ప్రతిపాదనను జీవో నెంబర్ 32 ను వ్యతిరేకిస్తున్నామని, మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ ,సానిటేషన్ ముందుగా మెరుగుపరచాలని, జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరత తీర్చలేక పోతున్నారని  అన్నారు. కొంతసేపు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం తర్జనభజన అనంతరం మున్సిపల్ కౌన్సిలర్ మట్టపర్తి నాగేంద్ర మాట్లాడుతూ జీవో నెంబర్ 32 ను కౌన్సిల్ ఆమోదించిందని, సబికుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. మరో కౌన్సిలర్ సంసాని నాని మాట్లాడుతూ వసూలు 8 కోట్లు దాటింది కాబట్టి స్పెషల్ గ్రేడ్ కార్పొరేషన్ గా పరిగణిస్తారని, గతంలో అభివృద్ధి తీర్మానాలకు ఆమోదించామని, జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి కార్పొరేషన్ గా అర్హత సాధించవచ్చు అని అన్నారు, మరో కౌన్సిలర్ గువ్వాల  రాజేష్ మాట్లాడుతూ సానిటేషన్ పూర్తిగా క్షీణించిందని,డ్రైనేజీ, పారిశుద్ధ్యం కొరకు ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క వ్యక్తి ఉన్నారని, తొలగించిన 60 మంది వర్కర్స్ ని తిరిగి కొనసాగించాలని కోరారు. దీనికి ఫ్లోర్ లీడర్ ఏడిద శ్రీను జనసేన టిడిపి కౌన్సిలర్లు కౌంటర్ ఇస్తూ, తమ వార్డులలో సానిటేషన్ మెరుగ్గానే ఉందని  అన్నారు .దీనిపై కమీషనర్ మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్స్ పై లిఖితపూర్వక ఫిర్యాదులు ఉన్నాయని పరిశీలిస్తామని అన్నారు. తొలుత ఎమ్మెల్యే ఆనందరావు ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ రావుని, పలువురు కౌన్సిలర్లని ఎమ్మెల్యే ప్రశ్నించారు. అమలాపురం మున్సిపాలిటీ అభివృద్ధి ని విస్తరించకుండా ఆపుతారా అని, ఈ విషయంలో ఎటువంటి పొలిటికల్ యాంగిల్స్ లేవని, అభివృద్ధిని రాజకీయం చేయ వద్దని, సెలక్షన్ గ్రేడ్ గా కౌన్సిలర్లు పెద్ద మనసుతో ఆమోదం తెలపాలని కోరారు, దీనిని వ్యతిరేకించి ప్రస్తుతం మీరు ఆపవచ్చు, కానీ రాబోయే రోజుల్లో మరో కౌన్సిల్ తీర్మానం చేసి ఆమోదించవచ్చు, లేదా ప్రజా ఓటింగ్ ద్వారా  ఆమోదింప చేయవచ్చు, అప్పుడు అమలాపురం మున్సిపాలిటీ అభివృద్ధిని ఆపిన వారిగా మిగిలిపోతారని, ఉమ్మడి జిల్లాలో రాజమండ్రి కాకినాడ నగరాలు మున్సిపాలిటీ విస్తరించి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, సబికులు సహకరించాలని కోరారు. అభివృద్ధి విషయంలో ప్రజాప్రతినిధులు సూచనలు సలహాలు ఇస్తే పాటిస్తామని అన్నారు.రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ కోనసీమ పర్యటనకు వస్తున్నారని, అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, పలువురు మంత్రాలను కలిసి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తెస్తున్నానని, త్వరలో 7 బ్రిడ్జిలు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే సంక్రాంతికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పండుగగా నిర్ణయించిందని, రెండవసారి ఎమ్మెల్యేగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రతిష్టాత్మకంగా ఎస్ యానం బీచ్ ని అభివృద్ధిపరిచి, టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించి, ఫెస్టివల్ కి రోజు రెండు లక్షల మంది యాత్రికులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, టూరిస్టులు అందరూ వచ్చి సంక్రాంతి పండుగను విజయవంతం చేయాలని కోరారు.