ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సామగ్రి పంపిణీ

- వెంకట సూర్య హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో..

(ఆలమూరు):-


ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో భాగంగా నిరుపేద కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత గ్యాస్ కనెక్షన్లను అందిస్తుందని వెంకట సూర్య హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీ అధినేత ఈదల చినబాబు అన్నారు.శనివారం ఆలమూరు మండలంలోని పెనికేరు గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ స్టవ్, నిండు సిలిండర్, రెగ్యులేటర్, పైపు, బాండ్లను వెంకట సూర్య హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీస్ వారు 16 మందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఏ రాజు పాల్గొని స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు స్వయంగా సామగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా ఈదల చిన్నబాబు మాట్లాడుతూ, ఉజ్వల యోజన పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ సహా అవసరమైన సామగ్రి అందించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ స్కీమును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే గ్యాస్ సామగ్రిని పొందిన లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పథకం తమ కుటుంబ జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. మహిళల ముఖాలలో ప్రత్యేకమైన సంతోషం కనిపించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావులకు వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గొడవర్తి సూర్య భాస్కరరావు, జనసేన గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గోపు గోపాలకృష్ణ, కొమిశెట్టి రఘు,కొమ్ము నారాయడు, గన్ని రామన్న చౌదరి, కుడుపూడి కొండ, గుత్తుల శ్రీకృష్ణ, మేక రామన్న , వంటిపల్లి సురేష్, కోన శ్రీనివాస్ దత్తుడు, పంచాయతీ కార్యదర్శి అయ్యన్న,లబ్ధిదారులు, హెచ్.పీ గ్యాస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.