అనారోగ్య బాధితునికి మంత్రి సుభాష్ రూ. 10 వేలు ఆర్థిక సాయం

అనారోగ్య బాధితునికి  మంత్రి సుభాష్ రూ. 10 వేలు ఆర్థిక సాయం       

Andhra Pradesh
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. వివరాల్లో వెళితే రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం గ్రామపంచాయతి బియ్యం పేటకి చెందిన వాసంశెట్టి శంకర్రావు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన అనారోగ్య పరిస్థితిని స్థానిక కూటమి పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న మంత్రి సుభాష్ అతని ఇంటికి వెళ్లి పరామర్శించి వైద్య సహాయం నిమిత్తం రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందించి, ధైర్యం చెప్పారు. మందులు సక్రమంగా తీసుకుంటూ మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో జీవించాలని సూచించారు. మంత్రి సుభాష్ ఔదార్యానికి శంకర్రావు కుటుంబ సభ్యులు , స్థానిక కూటమి పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.