ఈ నెల 15,16 తేదీల్లో మంత్రి సుభాష్ - "ప్రజా దర్బార్"

 ఈ నెల 15,16 తేదీల్లో మంత్రి సుభాష్ - "ప్రజా దర్బార్ " 


రామచంద్రపురం నియోజక వర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15, 16 తేదీల్లో  రెండు రోజులపాటు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 15 న రామచంద్రపురం, రామచంద్రపురం రూరల్ మండలాల ప్రజలకు,16 న కాజులూరు, కె గంగవరం మండలాల ప్రజలకు   

రామచంద్రపురంలోని ఉమ్మడి తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మంత్రి సుభాష్, అధికారులతో కలిసి  నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా విని, వాటి తక్షణ పరిష్కారంకు కృషి చేస్తారు. ఈ అవకాశంను నియోజకవర్గంలోని  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  మంత్రి సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు తమ సమస్యకు సంబంధించిన వినతిపత్రంతో పాటు, ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తీసుకురావాలని,

వచ్చిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.