ఉత్సాహంగా జరిగిన ఉపాధ్యాయులు ఆటల పోటీలు

  


రామచంద్రపురం డివిజన్ ఉపాధ్యాయ ఆటల పోటీలు మొదటి రోజు ఉత్సాహం గా జరిగాయి.రామచంద్రపురం ఉపావిద్యాశాఖ అధికారి ప్రత్తి రామలక్ష్మణ మూర్తి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సత్యం ఫౌండేషన్ చైర్మన్, సీనియర్ తెలుగుదేశం నాయకులు వాసంశెట్టి సత్యం ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ గాధంశెట్టి శ్రీదేవి, రామచంద్రపురం మండల పరిషత్ అధ్యక్షరా లు అంబటి భవాని, కె.గంగవరం మండల పరిషత్ అధ్యక్షరాలు పంపన నాగమణి మునిసిపల్ కౌన్సిలర్ లు, ఎం ఈ ఓ లు, ప్రధాన ఉపాధ్యాయులు, డి ఎస్ ఓ జి వి సుబ్రహ్మణ్యం, కె వి అర్ హాస్పిటల్ అధినేత కోట సతీష్ మొదలగు వారు పాల్గొన్న ఈ సభ లో వాసంశెట్టి సత్యం మాట్లాడుతు కూటమి ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహం ఇస్తుందని, ఉపాధ్యాయులకు వృత్తి లో ఎదురై ఒత్తిడి ల నుండి ఉపశమనం పొందెందుకు గాను ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ క్రీడలలో అందరూ పాల్గొవాలని ఆయన కోరారు.ఈ రోజు ఐదు మండలాల నుండి మొత్తం 200 మంది ఉపాధ్యాయులు ఈ పోటీలో పాల్గొన్నారు అని అందరికి భోజన ఏర్పాట్లు చేశామని మండల విద్యాశాఖది అధికారి తాడి వీర్రాఘవ రెడ్డి తెలిపారు.అలాగే ఈ రోజు జరిగిన క్రికెట్ మ్యాచ్ లో రాయవరం జట్టు పై కపిలేశ్వర పురం జట్టు, రామచంద్రపురం జట్టు మండపేట జట్టుపై విజయం సాధించగా, అలాగే మహిళల త్రోబాల్ మ్యాచ్ లో రామచంద్రపురం, కపిలేశ్వరపురం జట్లు విజయం సాధించి ఫైనల్ కి చేరుకున్నాయని రేపు ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయని డివిజన్ ఇంచార్జ్ ఆని శ్రీనివాస్ తెలియచేసారు.