మంత్రి సుభాష్ ను కలిసిన రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సత్యవతి

మంత్రి సుభాష్ ను కలిసిన  రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ సత్యవతి



రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్  గడి సత్యవతి  (మండపేట) రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రామచంద్రపురం పట్టణంలోని 2,4  బూత్ లకు సత్యవతిని  పరిశీలకులుగా పార్టీ అధిష్టానం నియమించిన నేపథ్యంలో ఆయా బూత్ లో ఉన్న పార్టీ నాయకులను, కార్యకర్తలను  కలుసుకొని  అక్కడ సంగతులను , పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విషయమై చర్చించారు. అనంతరం మంత్రి సుభాష్ ను మర్యాదపూర్వంగా కలిసి  పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు  ప్రజలకు చేరువయ్యేలా, పార్టీను మరింత పటిష్టం  చేసేలా  కృషి చేయాలని  ఈ సందర్భంగా మంత్రి సుభాష్ సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు  కాకినాడ రామారావు, స్థానిక నాయకులు గడి గోవిందు తదితరులు పాల్గొన్నారు.