భారతీయ జనతా యువ మోర్చా అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడుగా . గాణాల కళ్యాణ్ నియామకం.

 


డా: బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువమోర్చ అధ్యక్షుడుగా గాణాల కళ్యాణ్ ను భారతీయ జనతా పార్టీ నియమించడం జరిగింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్,యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి,జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ఆదేశాల మేరకు కళ్యాణ్ ను బీజేపీ యువజన విభాగనికి అధ్యక్షుడుగా నియమించారు.ఈ విషయం పై కళ్యాణ్  స్పందిస్తూ,తనకీ బాధ్యతలను అందించిన రాష్ట్ర,జిల్లా నాయకత్వానికి ధన్యవాదములు తెలుపుతూ,రానున్న రోజుల్లో రాజకీయాల్లో యువత పాత్ర చాలా కీలకం అని,యువత రాజకీయాల్లో కూడా విశృతం గా పాల్గొనాలని పేర్కొన్నారు, ప్రస్తుతం నడుస్తున్న ఎన్.డి.ఎ కూటమి ప్రభుత్వం యువతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ,యువత భవిష్యత్తుకు భరోసా  కల్పించే విధంగా అడుగులు వేస్తుందని.యువతకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని తెలియచేసారు.

కళ్యాణ్ కు అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల పార్టీ నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు.