శ్రీలీల మొదటి సినిమాకి ముహూర్తం ఫిక్స్‌


MOVIE'S NEWS: కిస్ సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు తెలుగులో రాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. తెలుగు మూలాలు ఉన్న శ్రీలీల మొదటగా కన్నడ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కిస్ సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు తెలుగులో రాఘవేంద్ర రావు పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. పెళ్లి సందడి సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది, డాన్స్‌తో మెప్పించడంతో ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. 


శ్రీలీలకు ధమాకా సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ దక్కింది. ఆ సినిమా కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో శ్రీలీల ఒకే సారి అరడజను సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాల్లో కొన్ని మంచి విజయాన్ని సొంతం చేసుకోగా, మరికొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. అయినా కూడా శ్రీలీల వెనక్కి తిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చింది. 

పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్‌తో హిట్‌ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేయడం ద్వారా టాలీవుడ్‌లో మరింత పాపులర్ అయింది. అదే సమయంలో పుష్ప 2 లో ఐటెం సాంగ్‌ చేయడం ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా నిలిచింది. పుష్ప 2 లో చేసిన కిస్సిక్‌ పాట కారణంగా శ్రీలీల హిందీలో రెండు మూడు సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మొదటగా ఈమె ఆషికి 3 సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. 

అనురాగ్‌ బసు దర్శకత్వంలో అషికి 3 అనే టైటిల్‌తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల చిత్ర యూనిట్‌ సభ్యులు సినిమాకు మరో టైటిల్‌ అనుకుంటున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా అషికి 3 టైటిల్‌ అంటూ వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. శ్రీలీల ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

క్రిస్మస్ కానుకగా శ్రీలీల హిందీ మూవీ కార్తీక్‌ ఆర్యన్‌ హీరోగా శ్రీలీల హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ రొమాంటిక్ లవ్‌ స్టోరీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందనే విశ్వాసంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఈ సినిమాకు మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. శ్రీలీల బాలీవుడ్‌లో నటిస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా కమర్షియల్‌గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి. 

పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఫైనల్‌గా ఇదే ఏడాది చివర్లో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే క్రిస్మస్ బరిలో ఆలియా భట్‌ నటిస్తున్న ఆల్ఫా మూవీ ఉంది. లేడీ స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఆల్ఫా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆలియా భట్‌ ఈ సినిమా కోసం చాలా రిస్క్‌ చేసిందనే వార్తలు వస్తున్నాయి. 

పవన్‌కి జోడీగా శ్రీలీల 
శ్రీలీల తెలుగులో పవన్ కళ్యాణ్ కు జోడీగా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ ఇటీవలే పునఃప్రారంభం అయింది. తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ దర్శకుడు హరీష్ శంకర్‌ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాతో పాటు తెలుగులో మరో రెండు సినిమాలకు శ్రీలీల గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. 

తమిళ్‌లో ఈమె పరాశక్తి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందుతున్న ఆ సినిమాకు సుధ కొంగర దర్శకత్వం వహిస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న శ్రీలీల ముందు ముందు స్టార్‌ హీరోయిన్‌గా మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.