*వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన పేరవరం గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసరి...*
*కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా తెదేపా అధ్యక్షుడు గుత్తుల సాయి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...*
కూటమి పాలన పట్ల ప్రజల్లో సానుకూలత నెలకొందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. వైసీపీ నాయకుల సైతం కూటమి వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. శుక్రవారం ఆత్రేయపురం మండలం పేరవరం వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసరి రామాంజనేయులు, వైసీపీ నాయకుడు అత్తిలి సుబ్బారావు, 40 మంది కార్యకర్తలతో జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ,పల్లి మంగాదేవి భీమరావు,కంఠంశెట్టి శ్రీనివాస్,ముళ్ళపూడి భాస్కరరావు, కాయల జగన్నాధం, కుసంపూడి రామకృష్ణరాజు పాల్గొన్నారు.



Social Plugin